Published on Sep 26, 2024
Government Jobs
ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ - ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులు
ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ - ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులు

తెలంగాణలో 633 ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేష‌న్ జారీ చేసింది.

మొత్తం ఖాళీలు: 633

వివరాలు:

జోన్‌-1లో 79, జోన్‌-2లో 53, 3లో 86, 4లో 98, 5లో 73, 6లో 154, 7వజోన్‌లో 88 పోస్టులున్నాయి.

విభాగాలు:

1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 445 పోస్టులు

2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 185 పోస్టులు

3. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్‌ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 2 పోస్టులు

అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్‌ డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకొని ఉండాలి.

వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్దులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు, ఎన్‌సీసీ, ఎక్స్‌ సర్వీ్స్‌మ్యాన్‌లకు మూడేళ్లు వయోపరిమితిని సడలింపునిచ్చారు.

పే స్కేల్: నెలకు రూ.31,040- రూ.92,050.

ఆన్‌లైన్ పరీక్ష ఫీజు: రూ.500.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేసిన వారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-10-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-10-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 23-10-2024 నుంచి 24-10-2024 వరకు.

పరీక్ష తేదీ: 30-11-2024.

Website:https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm