ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలను సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ 2025, ఏప్రిల్ 18న ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 15 శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించించారు.
గ్రూప్-1లోని రెల్లి, ఉపకులాలకు 1%, గ్రూప్-2లోని మాదిగ, ఉపకులాలకు 6.5%, గ్రూప్-3లోని మాల, ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని ప్రతిపాదించింది.