Published on Oct 18, 2024
Scholarships
ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్
ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్

విదేశాల్లో ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపకారవేతనాలు అందిస్తోంది. విద్యావంతులైన ఎస్సీ విద్యార్థులు మరింత ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ‘అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి’ (overseas scholarship) పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాయమందిస్తోంది. యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లోని విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణకు చెందిన ఎస్సీ విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చదివేందుకు అవకాశం ఉంటుంది.

వివ‌రాలు:

1. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.

2. స్కాలర్‌షిప్ గ్రాంట్: రూ.20 లక్షల వరకు.

3. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు.

4. కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌, జీఆర్‌ఈ/ జీమ్యాట్‌, ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ టెస్ట్‌ స్కోరు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 29-10-2024.

Website:https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do