కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్, రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతిని అనుసంధానించి దళితులకు ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా 4,074 ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను మొత్తం రూ.122 కోట్లు ఖర్చవుతాయని అంచనా.
ఇదే పథకం కింద ఎస్సీ రైతులకు రూ.1.50 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,685 మంది రైతులకు వీటిని అందించనున్నారు.
దళితులకు ఆటోలు అందించే పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) పరిధిలో అమలవుతున్న ‘ఉన్నతి’ పథకాన్ని అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.