పంజాబ్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ (ఎస్‌సీఎల్) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 25
వివరాలు:
అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లు మించరాదు.(ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు; ఓబీసీ వారికి మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).
దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.944. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు రూ.472.
ఎంపిక విధానం: రాత పరీక్ష తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.02.2025.
Website:https://www.scl.gov.in/