Published on Nov 5, 2025
Current Affairs
ఎస్‌బీఐ వ్యాపారం రూ.100 లక్షల కోట్లకు
ఎస్‌బీఐ వ్యాపారం రూ.100 లక్షల కోట్లకు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరింది. ఆస్తుల పరంగా ప్రపంచంలో 43వ అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచింది. ఈ విషయాన్ని బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి 2025, నవంబరు 4న వెల్లడించారు. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తూ, ఆయన ఈ వివరాలు తెలిపారు.