దేశంలో రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న ప్రజల్లో అసమానతలు తగ్గుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన నివేదికలో వెల్లడించింది.
2014 నుంచి 2023 మధ్యకాలంలో ఆదాయ పన్ను రిటర్న్‌లను, ఆదాయాల తీరుతెన్నులను ఎస్‌బీఐ ఆర్థిక విభాగం విశ్లేషించింది.
రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారిలో ఆదాయ అసమానతలు 74.2 శాతం తగ్గాయి - అని వివరించింది.
రూ.3.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారిలో ఆదాయ అసమానతలు 2014లో 31.8 శాతం ఉండగా, 2021 నాటికి 12.8 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.