స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు మేనేజింగ్ డైరెక్టరుగా రామమోహన రావు అమర 2024, డిసెంబరు 18న నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయన్ను ఈ పదవిలో కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఇప్పటివరకు ఆయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. ఇంతకుమునుపు ఎస్‌బీఐ ఎండీగా ఉన్న సి.శ్రీనివాసులు శెట్టి, బ్యాంక్ ఛైర్మన్‌గా నియమితులవ్వడంతో ఎండీ పదవీ ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఆ స్థానంలోకి రామమోహన్ రావు రానున్నారు.