Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 3, 2025
Government Jobs
ఎస్‌బీఐలో 996 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్లు
ఎస్‌బీఐలో 996 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్లు

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముంబయి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ (ఎస్‌సీఓ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 996 

వివరాలు:

1. వీపీ వెల్త్‌(ఎస్‌ఆర్‌ఎం): 506

2. ఏవీపీ వెల్త్‌ (ఆర్‌ఎం): 206

3. కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌: 284

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 2025 మే 1వ తేదీ నాటికి 20 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు,  పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 23.

Website:https://sbi.bank.in/web/careers/current-openings