Published on Dec 27, 2024
Government Jobs
ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ పీవో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 600 (ఎస్సీ- 87, ఎస్టీ- 57, ఓబీసీ- 158, ఈడబ్ల్యూఎస్‌- 58, యూఆర్‌- 240)

వివరాలు:

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం ఫైనల్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి (01.04.2024 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష అంశాలు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ (30 ప్రశ్నలు).

మొత్తం ప్రశ్నల సంఖ్య: 100. గరిష్ఠ మార్కులు: 100. పరీక్ష వ్యవధి: 1 గంట.

మెయిన్స్‌ సబ్జెక్టులు: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 60 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (30 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ ఎకానమీ/ బ్యాంకింగ్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్- 420 ప్రశ్నలు మార్కులు).

మొత్తం ప్రశ్నల సంఖ్య: 170. గరిష్ఠ మార్కులు: 200. పరీక్ష వ్యవధి: 3 గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చిత్తూరు, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2025, ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభం.

స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2025, మార్చి 8, 15.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: ఏప్రిల్‌ 2025.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఏప్రిల్‌ రెండో వారం.

స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: 2025, ఏప్రిల్‌/ మే.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: మే/ జూన్‌ 2025.

ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/ జూన్‌, 2025.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/ జూన్‌, 2025.

ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: మే/ జూన్‌, 2025.

తుది ఫలితాల ప్రకటన: మే/ జూన్‌, 2025.

Website:https://bank.sbi/web/careers/current-openings