తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ జనవరి 18న ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ... కార్యకలాపాలను విస్తరించనుంది.