Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 20, 2026
Government Jobs
ఎస్‌ఐడీబీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు
ఎస్‌ఐడీబీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు

లఖ్‌నవూ ప్రధాన కార్యాలయంగా గల స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన డేటా సైంటిస్ట్‌, స్పెషలిస్ట్స్‌, ఇంజినీర్స్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. డేటా సైంటిస్ట్ (DS): 01

2. ఏఐ స్పెషలిస్ట్స్‌ (AIS): 02

3. ఎంఎల్‌ ఇంజినీర్లు (MLE): 01

4. డేటా ఇంజినీర్లు (DE): 02

5. డేటా ప్రొటక్షన్‌ ఆఫీసర్‌: (DPO) 01

6. రిలేషన్‌షిప్‌ మేనేజర్: 02

7. పోర్ట్‌ఫోలియో మేనేజర్‌: 02

8. స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ మేనేజర్‌: 02

9. క్లస్టర్‌ మేనేజర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ/పీజీడీఎం, సీఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

వయోపరిమితి: డేటా ప్రొటక్షన్‌ ఆఫీసర్‌కు 45 ఏళ్లు; డేటా ఇంజినీర్స్‌, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌కు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌  recruitment@sidbi.in ద్వారా.

దరఖాస్తు గడువు: 07.04.2026.

Website:https://www.sidbi.in/en/