Published on Jan 27, 2025
Government Jobs
ఎస్‌ఐడీబీఐలో అసోసియేట్‌ మేనేజర్‌ పోస్టులు
ఎస్‌ఐడీబీఐలో అసోసియేట్‌ మేనేజర్‌ పోస్టులు

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

థీమ్‌ లీడర్‌- జెండర్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ లిటరసీ- 01

అసోసియేట్‌ మేనేజర్‌- ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌- 01

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్‌/ కామర్స్‌/ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా తత్సమాన విభాగాల్లో పీజీ/ పీహెచ్‌డీ ఉండాలి. 

వయోపరిమితి: 31-12-2024 నాటికి థీమ్‌ లీడర్‌- జెండర్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ లిటరసీ పోస్టుకు 35 ఏళ్లు, అసోసియేట్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు మించకూడదు.

ఉద్యోగ స్థానం: న్యూ దిల్లీ/ లఖ్‌నవూ. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు గడువు: 07.02.2025

Website:https://www.sidbi.in/en/