Published on Sep 19, 2024
Government Jobs
ఎస్‌ఏసీలో జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీలు
ఎస్‌ఏసీలో జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీలు

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 22

వివ‌రాలు:

జూనియర్ రిసెర్చ్ ఫెలో: 19

రిసెర్చ్ అసోసియేట్: 03

విభాగాల వారీగా ఖాళీలు:

1. జియో ఫిజిక్స్‌/ అప్లైడ్ జియో ఫిజిక్స్‌/ జువాలజీ/ అప్లైడ్ జువాలజీ: 03

2. ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌: 08

3.  మెరైన్ బయాలజీ/ మెరైన్ జియో ఫిజిక్స్‌: 02

4. జియో- ఇన్ఫర్మేటిక్స్‌/ రిమోట్ సెన్సింగ్/ జియో స్పేషియల్ టెక్నాలజీ: 06

5. ఫిజికల్ ఓషనోగ్రఫీ: 02

6. అట్మాస్పియరిక్ సైన్స్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు జూనియర్ రిసెర్చ్ ఫెలో 

పోస్టులకు రూ.37,000-రూ.42,400; రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు రూ.58,000-రూ.67,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 07-10-2024.

Website:https://www.isro.gov.in/