Published on Dec 11, 2024
Current Affairs
ఎస్‌ఎం కృష్ణ మరణం
ఎస్‌ఎం కృష్ణ మరణం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) 2024, డిసెంబరు 10న బెంగళూరులో మరణించారు.

ఆయన పూర్తిపేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. 1932 మే 1న సోమనహళ్లిలో జన్మించారు.

1980ల్లో కేంద్ర మంత్రిగా పరిశ్రమలు, ఆర్థిక శాఖలు చూశారు. 1999లో కర్ణాటక పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్‌కు ఘనవిజయాన్ని అందించి, నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

2004లో మహారాష్ట్ర గవర్నర్‌గా, 2009 నుంచి 2012 వరకు కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 2017లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు.