Published on Jun 8, 2025
Government Jobs
ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2025
ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2025

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌స్‌సీ) 2025 సంవత్సరానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాతీయ స్థాయి పరీక్ష భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీకి

దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య:  దాదాపు 261.

వివరాలు: 

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి (గ్రూప్‌ బి, నాన్‌ గేజిటెడ్‌) & డి (గ్రూప్‌ సి)ఎగ్జామినేషన్‌, 2025

పోస్టుల వారీగా వివరాలు:

1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమానం. ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ నైపుణ్యాలు ఉండాలి.

వయోపరిమితి: 01.08.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు (02.08.1995 - 01.08.2007 మధ్య జన్మించారు).

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'డి'

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమానం. ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ నైపుణ్యాలు ఉండాలి.

వయోపరిమితి: 01.08.2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు (02.08.1998 - 01.08.2007 మధ్య జన్మించారు).

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్- 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్- 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్- 100 మార్కులు మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 

పరీక్ష వ్యవధి: రెండు గంటలు.

ఎంపిక ప్రక్రియ: స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.06.2025.

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 27.06.2025.

దరఖాస్తు సవరణకు తేదీలు: 01.07.2025 నుంచి 02.07.2025.

ఆన్‌లైన్‌ ఆధారిత పరీక్ష తేదీలు: 06.08.2025 నుంచి 11.08.2025.

Website: https://ssc.nic.in/

Apply online: https://ssc.gov.in/login