Published on Jun 11, 2025
Government Jobs
ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్
ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) 2025 సంవత్సరానికి గాను కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్‌) పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీ చేయనుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14,582 

వివరాలు:

1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 

2. అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

3. ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్

4. ఇన్‌స్పెక్టర్, (సెంట్రల్ ఎక్సైజ్)

5. ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

6. ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

7. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

8. సబ్ ఇన్‌స్పెక్టర్

9. ఇన్‌స్పెక్టర్ పోస్టులు

10. ఇన్‌స్పెక్టర్

11. సెక్షన్ హెడ్

12. అసిస్టెంట్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

13. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్

14. రీసెర్చ్ అసిస్టెంట్

15. డివిజనల్ అకౌంటెంట్

16. సబ్ ఇన్‌స్పెక్టర్

17. సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్

18. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్

19. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II

20. ఆఫీస్ సూపరింటెండెంట్

21. ఆడిటర్

22. అకౌంటెంట్

23. అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్

24. పోస్టల్ అసిస్టెంట్/సోర్టింగ్ అసిస్టెంట్

25. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్‌లు

26. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్

27. ట్యాక్స్ అసిస్టెంట్

28. సబ్-ఇన్‌స్పెక్టర్

అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ పోస్ట్లుకు టెన్‌+2 స్థాయిలో గణితంలో కనీసం 60% మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు  01.08.2025 నాటికి అర్హత సాధిస్తే దరఖాస్తు చేయవచ్చు.

వయోపరిమితి: 01.08.2025  తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

జీతం: 

పే లెవల్-7 నెలకు (రూ.44,900 – రూ.1,42,400)

పే లెవల్-6 నెలకు (రూ.35,400 – రూ.1,12,400)

పే లెవల్-5 నెలకు  (రూ.29,200 – రూ.92,300)

పే లెవల్-4 నెలకు (రూ.25,500 – రూ.81,100)

దరఖాస్తు ఫీజు: జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు/ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం:

టైర్-I (CBT) – ఆబ్జెక్టివ్ పరీక్ష.

టైర్‌-II (CBT) – ఆబ్జెక్టివ్ పరీక్ష + స్కిల్ టెస్ట్‌లు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్.

టైర్‌-I పరీక్ష: 13 – 30 ఆగస్టు 2025.

టైర్‌-II పరీక్ష: డిసెంబర్ 2025.

పరీక్ష కేంద్రాలు:

దేశవ్యాప్తంగా అన్ని జోన్‌లలో ఉన్నాయి – నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్.

మూడు పరీక్ష కేంద్రాల ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 04 జూలై 2025.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 05 జూలై 2025.

Website:https://ssc.gov.in/

Apply online:https://ssc.gov.in/login