Published on Jun 7, 2025
Government Jobs
ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2025
ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2025

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ గ్రూప్‌ ‘బీ’ నాన్‌ గేజిటెడ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన 'కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2025' నోటిఫికేసన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: దాదాపు 437.

వివరాలు:

1. జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ 

2. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ 

3. జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ 

4. సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ 

5. సీనియర్ ట్రాన్స్‌లేటర్‌ 

6. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌)

అర్హతలు: పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్‌లేషన్‌(హిందీ/ ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్/ సీనియర్ ట్రాన్స్‌లేటర్  పోస్టులకు రూ.44,900- రూ.1,42,400. ఇతర పోస్టులకు రూ.35,400- రూ.1,12,400.

పరీక్ష విధానం: 

పేపర్-1 (ఆబ్జెక్టివ్ టైప్/ కంప్యూటర్ బేస్డ్ మోడ్) సబ్జెక్టులు: జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్  (100 ప్రశ్నలు/ 100 మార్కులు); పేపర్-2 (డిస్క్రిప్టివ్‌) సబ్జెక్టులు: ట్రాన్స్‌లేషన్‌, ఎస్సే, మొత్తం 200 మార్కులు. 

పరీక్ష వ్యవధి: 2 గంటలు.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.06.2025.

దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేదీ: 27.06.2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 01.07.2025 నుంచి 02.07.2025 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1): 12.08.2025.

హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌: 180093063.

Website:https://ssc.gov.in/

Apply online:https://ssc.gov.in/login