పశ్చిమ బెంగాల్, కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ (ఎస్ఎంపీ) రెగ్యులర్ ప్రాతిపదికన కింది మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్: 10
2. అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ): 01
3. సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 01
4. సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ (అఫీషియల్ లాంగ్వేజ్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ / సివిల్), ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000.
దరఖాస్తు ఫీజు: రూ.500+జీఎస్టీ; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100+జీఎస్టీ.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-11-2024.