Published on Jun 11, 2025
Government Jobs
ఎస్‌ఈఆర్‌సీలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు
ఎస్‌ఈఆర్‌సీలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌) ఆధీనంలోని జాతీయ ప్రయోగశాల అయిన సీఎస్‌ఐఆర్‌-స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ సెంటర్ (ఎస్‌ఈఆర్‌సీ) చెన్నై వివిధ విభాగాల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 10 

వివరాలు:

1. జూనియర్ స్టెనోగ్రాఫర్ (జేఎస్‌టీ) - 2 (యూఆర్‌)

2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) - జనరల్ - 6 పోస్టులు (యూఆర్‌-4 ఓబీసీ-1, ఎస్సీ-1)

3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) - ఫైనాన్స్ & అకౌంట్స్ - 1 (ఓబీసీ)

4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) - స్టోర్స్ & పర్చేజ్ - 1(ఎస్సీ)

అర్హత: 10+2/XII లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.

జేఎస్‌టీ: డీఓపీటీ నిబంధనల ప్రకారం స్టెనోగ్రఫీలో ప్రావీణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు. 

జీతం: నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500 – రూ.81,100, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200.

దరఖాస్తు రుసుము: జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు/మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక: స్టెనోగ్రఫీలో ప్రావీణ్య పరీక్ష, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 30 జూన్ 2025.

Website:https://serc.res.in/csir-recruitment