పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) పథకం ద్వారా అందిస్తున్న ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులలో ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ)
2. కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్
3. ఆటో మొబైల్ 2 వీలర్ సర్వీసింగ్
అర్హత: కోర్సులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీకామ్), ఇంటర్మీడియట్, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు.
వయోపరిమితి: 18 - 30 ఏళ్లు ఉండాలి.
కోర్సు వ్యవధి: మూడున్నర నెలలు.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ-508 284.
అడ్మిషన్ల తేదీ: 2025 మే 5.
కావలసిన పత్రాలు: అర్హత గల ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్, పాస్‌పొర్ట్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు.
హైదరాబాద్-దిల్‌సుఖ్ నగర్ నుంచి 524 నంబరు బస్సు సౌకర్యం కలదు.
వివరాలకు సంప్రదించండి: 9133908000, 9133908111, 9133908222, 9948466111
Website:https://www.srtri.com/