తెలుగు రాష్ట్రాల్లో 2019-21 మధ్య కాలంలో మాతృమరణాల నిష్పత్తి పెరిగినట్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం(ఎస్‌ఆర్‌ఎస్) నివేదిక వెల్లడించింది.
2018-20 మధ్యకాలంలో ఇది ఏపీలో 45, తెలంగాణలో 43 మేర ఉండగా, 2019-21 మధ్యకాలంలో ఏపీలో 46, తెలంగాణలో 45కి పెరిగింది.
ఇదే కాలావధిలో దక్షిణాది రాష్ట్రాల్లో మాతృమరణాలు సగటున 49 నుంచి 47కి తగ్గాయి. నిర్దిష్ట సమయంలో జరిగే ప్రతి లక్ష కాన్పులకు నమోదయ్యే తల్లుల మరణాల ఆధారంగా మాతృమరణాల నిష్పత్తిని లెక్కిస్తారు.
అతితక్కువ మాతృమరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ(20), మహారాష్ట్ర(38) తర్వాత తెలంగాణ(45), ఆంధ్రప్రదేశ్(46), తమిళనాడు(49), ఝార్ఖండ్(51), గుజరాత్(53), కర్ణాటక(63) ఉన్నాయి.