Published on Dec 25, 2025
Current Affairs
ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం
ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం
  • దేశ చరిత్రలో తొలిసారిగా 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి 2025, డిసెంబరు 24న ఉపగ్రహాన్ని తీసుకుని అత్యంత శక్తిమంతమైన బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం6 నింగిలోకి దూసుకెళ్లింది. దేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’లో ఎల్‌వీఎం3 రాకెట్‌నే ఉపయోగించనున్నారు. 
  • అమెరికాలోని టెక్సస్‌కు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ రూపొందించిన అత్యంత బరువైన బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని ఇస్రో 518.5 కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.