Published on Dec 22, 2025
Current Affairs
ఎలాన్‌ మస్క్‌
ఎలాన్‌ మస్క్‌
  • 2025, డిసెంబరు 21 నాటికి ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ 749 బి.డాలర్ల (రూ.67.41 లక్షల కోట్ల)కు చేరింది. ప్రపంచంలోనే తొలిసారిగా 700 బి.డాలర్లకు పైగా నికర సంపద కలిగిన వ్యక్తిగా మస్క్‌ రికార్డు సాధించారు. డెలావేర్‌ సుప్రీంకోర్టు 139 బిలియన్‌ డాలర్ల (రూ.12.51 లక్షల కోట్ల) విలువైన టెస్లా స్టాక్‌ ఆప్షన్లను పునరుద్ధరించడంతో పాటు, 2018లో ఎలాన్‌ మస్క్‌కు ప్రకటించిన 55 బి.డాలర్ల (రూ.4.95 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీకి అనుకూలంగా తీర్పు వెలువరించడంతో ఇది సాధ్యమైంది.
  • మన దేశంలోని 4 అతి పెద్ద నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువను కలిపినా, మస్క్‌ సంపద విలువే అధికం. 
  • గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా (సుమారు 500 బి.డాలర్లు-రూ.45 లక్షల కోట్లు) ఉన్నారు.