టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ సంపద విలువ 400 బిలియన్ డాలర్లను మించింది. ప్రపంచ చరిత్రలో ఈ స్థాయి సంపద ఆర్జించిన తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం మస్క్ సంపద విలువ 447 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు)గా ఉంది.
టెస్లా షేరు విలువ అమెరికా అధ్యక్ష ఎన్నికల తరవాత 65% పెరిగింది. కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్ ఏఐ విలువ మే నుంచి రెట్టింపై 50 బి.డా.కు చేరింది. స్పేస్ ఎక్స్ విలువ 350 బి.డా.కు చేరింది.