దేశీయంగా సెమీకండక్టర్ యేతర (పాసివ్) ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ఉత్పత్తి పెంచేందుకు రూ.22,919 కోట్ల కేటాయింపులతో ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్’కు 2025, మార్చి 28న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ ప్రోత్సాహానికి తలపెట్టిన తొలి పథకం ఇదే.
ఆరేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకం ద్వారా రూ.59,350 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 91,600 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.