Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 9, 2026
Current Affairs
ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక
ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక
  • దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే.. రాబోయే 10 ఏళ్ల కాలంలో వీళ్ల పెట్టుబడులు దేశ జీడీపీకి సుమారు రూ.40 లక్షల కోట్లను జతచేస్తాయని ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక పేర్కొంది. మహిళల వద్ద నిరుపయోగంగా ఉన్న పొదుపు మొత్తాన్ని ఉత్పాదకత, వృద్ధి ఆధారిత మూలధనం వైపు మళ్లించినప్పుడు ఈ ప్రభావం కనిపిస్తుందని తెలిపింది. 
  • అందరికీ ఆర్థిక సేవలను దరిచేర్చడం ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందే విషయంలో మహిళలు ఇంకా దూరంగానే ఉన్నారని నివేదిక గుర్తించింది. బ్యాంకుల్లో మహిళల ఖాతాలు 2011లోని 26 శాతం నుంచి 2024లో 89 శాతానికి పెరిగినప్పటికీ.. వీటిని పొదుపు కోసం కంటే కూడా ప్రభుత్వ పథకాల నగదు బదిలీ, నగదు ఉపసంహరణ కోసం ఎక్కువగా వాడుతున్నారని తెలిపింది.