ఎల్‌ఆర్ శ్రీహరి భారత 86వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.
ఆసియా చెస్ టోర్నీలో అతడికి జీఎం హోదాకు అవసరమైన మూడో నార్మ్ లభించింది.
ఈ టోర్నీ చివరి రౌండ్లో ఇనియన్ చేతిలో ఓడినా.. 5.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు.
తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల శ్రీహరి.. 2023 ఖతార్ మాస్టర్స్, చెన్నై ఓపెన్లో తొలి రెండు జీఎం నార్మ్‌లు సొంతం చేసుకున్నాడు. గతేడాదే 2500 ఎలో రేటింగ్‌ను కూడా అందుకున్నాడు.