మన దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 2030 సంవత్సరానికి మూడు రెట్లు వృద్ధి చెంది 97 కోట్లకు చేరే అవకాశం ఉందని టెలికాం గేర్ తయారీ సంస్థ ఎరిక్‌సన్ తన నివేదికలో పేర్కొంది.
దేశంలో మొత్తం మొబైల్ చందాదారుల్లో ఇది 74 శాతానికి సమానమవుతుందని తెలిపింది. ఎరిక్‌సన్ కన్జూమర్‌ల్యాబ్ రిసెర్చ్ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 5జీ పనితీరుకు కీలక చోదకంగా జెనరేటివ్ ఏఐ యాప్‌లు మారుతున్నాయి.
2024 చివరకు భారత్‌లో 5జీ వినియోగదారుల సంఖ్య 27 కోట్లకు చేరుతుందని, మొత్తం చందాదారుల్లో ఇది 23 శాతమని ఎరిక్‌సన్ వివరించింది.
ఇదే సమయంలో అంతర్జాతీయంగా 5జీ చందాదారుల సంఖ్య దాదాపు 230 కోట్లకు చేరనుంది. మొత్తం మొబైల్ వినియోగదారుల్లో ఇది 25 శాతానికి సమానం.