ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 89
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయోపరిమితి: 01-11-2024 తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.31,000 - రూ.92,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్ మెన్‌కు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11-04-2025.
Website:https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/79147/Instruction.html