Published on Oct 23, 2024
Government Jobs
ఎయిర్‌ ఇండియా, కోల్‌కతాలో వివిధ‌ పోస్టులు
ఎయిర్‌ ఇండియా, కోల్‌కతాలో వివిధ‌ పోస్టులు

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 142.

వివరాలు:

1. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 30 పోస్టులు

2. హ్యాండీమ్యాన్ (మేల్‌): 112 పోస్టులు

అర్హత: యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి, హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్; హ్యాండీమ్యాన్ పోస్టుల 10వ తరగతితో పాటు ఇంగ్లిష్ భాష చదవడం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 సంవత్సరాలు.

జీతం: నెలకు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులలకు రూ.24,960. హ్యాండీమ్యాన్ పోస్టులకు రూ.22,530.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2024.

Website:https://www.aiasl.in/