ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 156.
వివరాలు:
1. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్/ డ్యూటీ మేనేజర్: 2 పోస్టులు
2. డ్యూటీ ఆఫీసర్: 2 పోస్టులు
3. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 17 పోస్టులు
4. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 1 పోస్టు
5. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 6 పోస్టులు
6. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 22 పోస్టులు
7. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 58 పోస్టులు
8. సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 5 పోస్టులు
9. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 26 పోస్టులు
10. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 17 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సు, డిగ్రీ ఉత్తీర్ణత, హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఇంటర్వ్యూ తేదీలు: 23, 25, 26, 27, 28-10-2024.
వేదికలు:
క్రమ సంఖ్య 1 నుంచి 7 వరకు పోస్టులకు- హోటల్ రివా ప్యాలెస్, బి-301, 3వ అంతస్తు, తీర్థ్ జ్యోతి ప్లాజా, గాంధీ ఆశ్రమం దగ్గర, ఆర్‌టీవో సర్కిల్, అహ్మదాబాద్.
క్రమ సంఖ్య 8 నుంచి 10 వరకు ఆర్‌టీవో సర్కిల్ ప్లే గ్రౌండ్, కలెక్టర్ కార్యాలయం ఎదురుగా, ఆశ్రయే ఇన్ హోటల్ పక్కన, అహ్మదాబాద్.
Website:https://www.aiasl.in/