విశాఖపట్నం, విజయవాడలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. జూనియర్ ఆఫీసర్-కస్టమర్ సర్వీస్: 04
2. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 01
3. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 08
అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్/ ఎలక్ట్రానిక్స్), డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
వయోపరిమితి: జూనియర్ ఆఫీసర్-కస్టమర్ సర్వీస్ పోస్టులకు 35 ఏళ్లు; మిగతా పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు జూనియర్ ఆఫీసర్-కస్టమర్ సర్వీస్ పోస్టులకు రూ.29,760; ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.24,960; యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు రూ.21,270.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, తదితరాల ఆధారంగా.
వేదిక: ఎన్‌టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎదురుగా, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఇంటర్వ్యూ తేదీలు: 11, 12-11-2024.
Website:https://www.aiasl.in/