Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 2, 2026
Current Affairs
ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం
ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం

 

 

  • సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్‌ ప్రొటెక్షన్‌ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగించనుంది. గూగుల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వచ్చే వెబ్‌ లింక్‌లను కూడా పరిశీలించేందుకు ఇది ఉపయోగ పడనుంది. వినియోగదారులు డిజిటల్‌ మోసాల బారిన పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరు సంస్థలూ ప్రకటించాయి. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఇంటెలిజెన్స్‌కు గూగుల్‌కు చెందిన రిచ్‌ కమ్యూనికేషన్స్‌ సర్వీసెస్‌ (ఆర్‌సీఎస్‌) జత కలవడం వల్ల మోసపూరిత సందేశాలను అడ్డుకోవడమే కాక, అధిక నాణ్యత గల ఫోటోలు/వీడియోలు, ఇంటరాక్టివ్‌ మెసేజ్‌లను వినియోగదారులు అందుకోగలరని తెలిపాయి.