Published on Dec 19, 2025
Current Affairs
ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓగా శాశ్వత్‌ శర్మ
ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓగా శాశ్వత్‌ శర్మ
  • భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా శాశ్వత్‌ శర్మ నియమితులయ్యారు. 2026 జనవరి 1న ఆయన బాధ్యతలు చేపట్టి, అయిదేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం శాశ్వత్‌ శర్మ ఎయిర్‌టెల్‌ వినియోగదారు వ్యాపార విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.
  • ప్రస్తుతం ఎండీ, వైస్‌ఛైర్మన్‌ హోదాలో ఉన్న గోపాల్‌ విత్తల్‌ 2026 జనవరి 1 నుంచి భారతీ ఎయిర్‌టెల్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.