Published on Oct 29, 2024
Current Affairs
ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓగా శాశ్వత్‌ శర్మ
ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓగా శాశ్వత్‌ శర్మ

ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓగా శాశ్వత్‌ శర్మ నియమితులయ్యారు. 2026 జనవరి 1 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. ఎయిర్‌టెల్‌కు గత 12 ఏళ్లుగా మేనేజింగ్‌ డైరెక్టరు, సీఈఓగా ఉన్న గోపాల్‌ విత్తల్‌ 2026 జనవరి 1 నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవి చేపడతారని కంపెనీ తెలిపింది.

ముందస్తు సన్నద్ధత కోసం ఆయన్ను భావి సీఈఓగా నియమించినట్లు సంస్థ వెల్లడించింది. సీఈఓ డిజిగ్నేట్‌గా వినియోగదారు సంబంధిత వ్యాపారాల బాధ్యతలన్నీ శర్మ చూసుకోనున్నారు.