Published on Oct 28, 2025
Walkins
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో సీనియర్ రెసిడెంట్  ఉద్యోగాలు

రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్  ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

వివరాలు:

సీనియర్ రెసిడెంట్  - 149

విభాగాలు:  అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ & ల్యాబ్ మెడిసిన్, పీడియాట్రిక్ సర్జరీ .

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎంలో ఉత్తీర్ణత ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

జీతం: నెలకు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ  తేదీ: 12.12.2025.

వేదిక: ఎల్‌టీ గ్రౌండ్, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఎయిమ్స్ రాయ్‌బరేలి.

Website:https://aiimsrbl.edu.in/recruitments