ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రాజ్‌కోట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 41
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్‌బీ, ఎంఎస్సీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2026 జనవరి 12వ తేదీ నాటికి 45 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.67,700.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.800.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 12.