Published on Feb 17, 2025
Government Jobs
ఎయిమ్స్‌ మధురైలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్‌ మధురైలో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, మధురై (ఎయిమ్స్‌ మధురై) వివిధ విభాగాల్లో  ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 39

వివరాలు:

ప్రొఫెసర్‌(ప్రొఫెసర్‌/అడిషనల్/అసోసియేట్‌/అసిస్టెంట్‌)

విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటి, ఫ్యామిలి మెడిసిన్‌, ఈఎన్‌టీ, ఫారెన్సిక్‌ మెడిసిన్‌ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్‌, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్‌,  పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, రేడియో డైయాగ్నోసిస్‌, ట్రామా ఎమర్జెకన్సీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎం, పిహెచ్‌డీ మొదలైన విభాగాల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొఫెసర్‌, అడిషనల్ ప్రొఫెసర్‌కు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-03-2025.

Website:https://aiimsmadurai.edu.in/vacancy-notices.php