Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 28, 2025
Government Jobs
ఎయిమ్స్ మదురైలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ మదురైలో  టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

మదురైలోని  ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్ ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ II ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ II

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌టీ/ ఎంఎల్‌టీ, బీఎస్సీ(పబ్లిక్ హెల్త్, మెడికల్ సోషల్ వర్క్, నర్సింగ్,సోషియాలజీ, సైకాలజీ, ఫార్మకాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.20,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

చిరునామా: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ మదురై.

దరఖాస్తు చివరి తేదీ: 19.12.2025.

Website:https://aiimsmadurai.edu.in/vacancy-notices.php