Published on May 20, 2025
Government Jobs
ఎయిమ్స్‌ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్‌ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50

వివరాలు:

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ప్రొఫెసర్‌

అసోసియేట్‌ ప్రొఫెసర్‌

అడిషనల్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌, మెడికల్‌ ఆంకాలజీ, మెడికల్‌ హెమటాలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, ఫాథలజీ, మైక్రోబయాలజీ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎం, ఎంసీహెచ్‌, ఎండీ/ ఎంఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌కు 58 ఏళ్లు; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు మించకూడదు. .

జీతం: నెలకు రూ.56,100.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.3,100. ఎస్సీ/ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ. 2,100. దివ్యాంగ అభ్యర్థులకు రూ.100. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2025.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.06.2025.

Website:https://www.aiimsmangalagiri.edu.in/

Apply online:https://aiimsmangalagirifacultyrec25.cbtexam.in/Home/ListofExam.aspx