ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరి కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
వివరాలు:
1. ప్రొఫెసర్: 07
2. అడిషనల్ ప్రొఫెసర్: 03
3. అసోసియేట్ ప్రొఫెసర్: 08
4. అసిస్టెంట్ ప్రొఫెసర్: 32
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంఫిల్, ఎంఎస్సీ, ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3,100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.2,100.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 25.