Published on Nov 18, 2024
Walkins
ఎయిమ్స్‌ మంగళగిరిలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టులు
ఎయిమ్స్‌ మంగళగిరిలో ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టులు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05.

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్/ సీనియర్ కన్సల్టెంట్: 01 పోస్టు
2. సీనియర్ రెసిడెంట్/ కన్సల్టెంట్: 01 పోస్టు
3. క్లినికల్ సైకాలజిస్ట్/ సైకియాట్రిక్ సోషల్ వర్కర్/ సైకియాట్రిక్ నర్సు: 01 పోస్టు
4. టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్/ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు: 01 పోస్టు
5. డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి పీజీ, ఎంఫిల్‌, డిప్లొమా, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
గరిష్ఠ వయో పరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్/ సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు. ఇతర పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-2024.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 13/12/2024.

వేదిక: అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఎయిమ్స్ మంగళగిరి.

వెబ్‌సైట్‌:https://www.aiimsmangalagiri.edu.in/