Published on Jan 25, 2025
Government Jobs
ఎయిమ్స్-భువనేశ్వర్ లో ప్రొఫెసర్ పోస్టులు
ఎయిమ్స్-భువనేశ్వర్ లో ప్రొఫెసర్ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) భువనేశ్వర్ వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 51

వివరాలు:

1. ప్రొఫెసర్: 18

2. అడిషనల్ ప్రొఫెసర్: 04

3. అసోసియేట్ ప్రొఫెసర్: 10

4. అసిస్టెంట్ ప్రొఫెసర్: 19

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 21-02-2025 తేదీ నాటికి 58 ఏళ్లు మించకకూడదు.

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్ కు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,38,300, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ.1,01,500.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21-02-2025.

Website:https://aiimsbhubaneswar.nic.in/Recruitment_Notice.aspx