Published on Dec 6, 2025
Walkins
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్‌ అసోసియేట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్‌ అసోసియేట్ ఉద్యోగాలు

దిల్లీలోని  ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్ దిల్లీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 06

వివరాలు:

1. రిసెర్చ్‌ అసోసియేట్  - 01

2. రిసెర్చ్ అసిస్టెంట్‌  - 01

3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -I - 01

4. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -II( నాన్ - మెడికల్ )- 01

5. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ - 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంఫీల్/పీహెచ్‌డీ( సోషల్ సైన్స్ / సైకాలజీలోక్లినికల్ సైకాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్ల - 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్ , ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -II కు రూ.67,000- రిసెర్చ్‌ అసిస్టెంట్ కు రూ.31,000.   ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -I కు రూ.18,000. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ కు రూ.32,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 20.12.2025. 

వేదిక: బోర్డ్ రూమ్, నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ ఎన్‌డీడీటీసీ, ఎయిమ్స్‌, సెక్టార్-19, కమలా నెహ్రూ నగర్, సీజీఓ కాంప్లెక్స్, (ఘజియాబాద్).

Website:https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment