Published on Apr 6, 2025
Government Jobs
ఎయిమ్స్‌ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్‌ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు

దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద/ డైరెక్ట్‌ రిక్యూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 199

వివరాలు:

ప్రొఫెసర్‌

అడిషనల్‌ ప్రొఫెసర్‌

అసోసియేట్‌ ప్రొఫెసర్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, సర్జరీ, మెడిసిన్‌, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ

తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్‌బీ, మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ, ఎంఎస్/ ఎండీ, ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రొఫెసర్‌కు 70ఏళ్లు; ఇతర పోస్టులకు 50ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000, ఎస్సీ/ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 10-04-2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-05-2025.

Website: https://rrp.aiimsexams.ac.in/