Published on Jun 17, 2025
Government Jobs
ఎయిమ్స్‌ దిల్లీలో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్‌ దిల్లీలో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది నాన్‌ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

సైంటిస్ట్‌- I(నాన్‌ మెడికల్‌)- 01

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌III- 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 35 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు సైంటిస్ట్‌కు రూ.56,000; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌కు రూ.28,000.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28-06-2025.

Website:https://rrp.aiimsexams.ac.in/