దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20.
వివరాలు:
1. క్లినికల్ రీసెర్చ్ ఆఫీసర్ - 02
2. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-II (నాన్ మెడికల్) - 01
3. ప్రాజెక్ట్ నర్సు [ప్రాజెక్ట్ నర్సు-III - 09
4. సీనియర్ టెక్నీషియన్ -01
5. లేబొరేటరీ టెక్నీషియన్ - 03
6 .అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ - 03
7. ప్రాజెక్ట్ ఆఫీసర్ - 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ ఎంఎల్‌టీ/ డిఎంఎల్‌టీ, ఎంబీబీఎస్ /బీవీఎస్‌సీ /బీడీఎస్ /ఎండీ/ ఎంవీఎస్‌సీ/ ఎండీఎస్/ ఎంపీహెచ్/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30ఏళ్ల నుంచి 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు క్లినికల్ రీసెర్చ్ ఆఫీసర్ కు రూ.1,04,000- రూ.80,000. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-IIకు రూ.67,000 - రూ.87,100. ప్రాజెక్ట్ నర్సు [ప్రాజెక్ట్ నర్సు-IIIకు రూ.28,000 -రూ.36,400 . సీనియర్ టెక్నీషియన్ కు రూ.28,000 -రూ.36,400. లేబొరేటరీ టెక్నీషియన్ కు రూ.20,000 -రూ.26,000.అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ కు రూ.28,000 - రూ.36,400.ప్రాజెక్ట్ ఆఫీసర్ కు రూ.28,000 - రూ.36,400.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా jobrecruitmentaiims@gmail.com కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 17.11.2025,
Website:https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment