ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డియోఘర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 174
వివరాలు:
విభాగాలు: అనస్థీషియాలజీ, క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ అండ్ వ్యాస్కులర్ సర్జరీ, కమ్యునిటీ అండ్ ఫ్యామిలి మెడిసిన్, డెంటల్ సర్జరీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ మొదలైనవి..
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎండీఎస్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.67,700.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.3000, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఈడబ్ల్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 20.
చిరునామా: రిజిస్ట్రార్ ఆఫీస్, 4వ అంతస్తు, ఎయిమ్స్, దేవీపుర్(అకడమిక్ బ్లాక్), డియోఘర్-814152, ఝార్ఖండ్.