డియోఘర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ డియోఘర్) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) - 09
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025, డిసెంబరు 18వ తేదీ నాటికి 33 ఏళ్లు మించకూడదు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.56,100.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా jr.recruitment@aiimsdeoghar.edu.in.కు పంపాలి.
ఎంపీకి ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.3000. ఓబీసీ, ఈడౠ్ల్య ఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 18